తమిళనాడులో దిత్వా తుపాను కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరువళ్లూరులో పూనమల్లీ జాతీయ రహదారిపై వరద నీరు చేరడంతో ఓ కారు అందులో చిక్కుకుంది. అదృష్టవశాత్తూ, డ్రైవర్ సమయానికి కారులోంచి బయటకు రావడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.