TG: రాష్ట్రంలో ‘SIR’ ప్రక్రియలో భాగంగా లంబాడీలు, ఆదివాసీలు, వలస కార్మికులు, మహిళలకు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని సీఎం రేవంత్ అన్నారు. శుక్రవారం గాంధీభవన్‌లో నిర్వహించిన మీటింగ్‌లో మాట్లాడుతూ.. దళితులు, మైనార్టీలు, మహిళల ఓట్లు గల్లంతయ్యే ప్రమాదం ఉందన్నారు.
కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సర్వే సమయంలో అసెంబ్లీ ఇన్‌ఛార్జ్‌లు అలర్ట్‌గా ఉండాలని, ఒక్క ఓటు కూడా తొలగించకుండా చూసుకోవాలని చెప్పారు.