‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ షోలో పంజాబ్‌లోని జలంధర్‌కు చెందిన వడ్రంగి చందర్‌పాల్ అరుదైన ఘనత సాధించాడు. ఐదేళ్ల కృషి తర్వాత హాట్‌సీట్ చేరుకున్న అతను వ్యూహాత్మకంగా ఆడి రూ.50లక్షలు గెలుచుకున్నాడు. సాధారణ విద్య మాత్రమే ఉన్నప్పటికీ, విషయ పరిజ్ఞానం పెంచుకోవడంపై పట్టుదలతో విజయం సాధించానని చెప్పాడు. ఈ డబ్బును పిల్లల చదువు, వ్యాపార విస్తరణకు వినియోగిస్తానన్న చందర్‌పాల్ మాటలు యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి.