AP:
ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని VTPS కూలింగ్ కెనాల్ లో యువతి మృతదేహం అవయవాలు వేరుచేసిన స్థితిలో లభించిన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మృతదేహాన్ని వేరే ప్రాంతం నుంచి తీసుకొచ్చి కెనాల్లో పడేసి ఉండొచ్చనే అనుమానంతో పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. నిందితుల కదలికలకు సంబంధించిన ఆధారాల కోసం పోలీసులు గాలిస్తున్నారు.