నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జర్‌పై గచ్చిబౌలి పోలీసు స్టేషన్‌లో ఓ యువతి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. పెళ్లి పేరుతో నమ్మించి,
అమెరికా, భారత్‌లలో కలిసి జీవించి, ఇప్పుడు మోసం చేశాడని యువతి ఆరోపించింది. వ్యాపారం పేరుతో ఉద్యోగం వదిలేయించి మోసం చేశాడని తెలిపింది. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లో సౌరవ్ గుజ్జర్‌ను గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.