TG: పెళ్లి చేసుకుంటానని నమ్మించి, పలుమార్లు వాయిదాలు వేస్తూ రూ.9.35 కోట్లు కాజేసిన ఆరోపణలపై సినీనటి అషురెడ్డి, ఆమె కుటుంబ సభ్యులపై హైదరాబాద్ సీసీఎస్‌లో కేసు నమోదైంది. HYD షేక్‌పేట్‌వాసి వై.వి.ధర్మేంద్ర అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను 2018లో పరిచయం చేసుకున్న అషురెడ్డి, ప్రేమ పేరుతో అతడిని నమ్మించి, ఆర్థిక అవసరాల పేరుతో డబ్బులు, బంగారం, ఆస్తులు, వాహనాలు కొనుగోలు చేయించుకుంది. అనంతరం పెళ్లికి నిరాకరించిందని, ఆమె సోదరి కూడా రూ.50 లక్షలు తీసుకుందని ధర్మేంద్ర తండ్రి ఫిర్యాదు చేశారు. సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.