చిరంజీవి ఆరోగ్యంపై అసత్య ప్రచారం.. ఛానెల్‌పై కేసు నమోదు

11చూసినవారు
చిరంజీవి ఆరోగ్యంపై అసత్య ప్రచారం.. ఛానెల్‌పై కేసు నమోదు
మెగాస్టార్ చిరంజీవి ఆరోగ్యంపై అసత్య ప్రచారాలు చేస్తూ, మార్ఫింగ్ వీడియోలను సామాజిక మాధ్యమాలలో వైరల్ చేసిన ఒక యూట్యూబ్ ఛానెల్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ కమలాపురి కాలనీకి చెందిన న్యాయవాది రామకృష్ణ మిర్యాల ఫిర్యాదు మేరకు, చిరంజీవి ప్రతిష్ఠకు భంగం కలిగించేలా తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. వివాదాస్పద కంటెంట్‌కు సంబంధించిన వీడియో లింకులు, స్క్రీన్ షాట్లను న్యాయవాది పోలీసులకు సాక్ష్యాలుగా అందజేశారు.

సంబంధిత పోస్ట్