ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


తల్లిదండ్రులు, చెల్లిని చంపి ఇంట్లోనే పూడ్చిపెట్టాడు!
Jan 31, 2026, 01:01 IST/

తల్లిదండ్రులు, చెల్లిని చంపి ఇంట్లోనే పూడ్చిపెట్టాడు!

Jan 31, 2026, 01:01 IST
కర్ణాటకలోని విజయనగర జిల్లా కొట్టూరులో జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అక్షయ్‌కుమార్‌(24) తల్లిదండ్రులు జయలక్ష్మీ (45), భీమరాజ్‌ (50), సోదరి అమృత (17)తో కలిసి ఉంటున్నాడు. అయితే అక్షయ్‌ ఈ నెల 27న తల్లిదండ్రులు, చెల్లెని దారుణంగా హత్య చేసి ఇంట్లోనే పూడ్చిపెట్టాడు. అనంతరం తన కుటుంబం కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ప్రవర్తనపై అనుమానం రావడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.. ముగ్గురిని తానే హత్య చేసినట్లు ఒప్పుకొన్నాడు. హత్యకు గల కారణాలు తెలియరాలేదని, దర్యాప్తు చేపట్టామని ఎస్పీ జాహ్నవి తెలిపారు.