ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు

0చూసినవారు
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు
TG: కరీంనగర్‌(D) వీణవంకలో నిర్వహించే సమ్మక్క-సారలమ్మ జాతరలో దళిత సర్పంచి సరోజను కొబ్బరికాయ కొట్టనివ్వడం లేదని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి తన కుటుంబసభ్యులతో కలిసి గురువారం రాత్రి నిరసన తెలిపారు. దీంతో కౌశిక్‌రెడ్డితోపాటు ఆయన సతీమణిని బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. అంతకుముందు కూడా HZB నుంచి వీణవంకకు బయలుదేరిన కౌశిక్‌రెడ్డిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. కాగా విద్వేషాలు ప్రేరేపించే విధంగా వ్యాఖ్యలు, అనుమతి లేకుండా ఆందోళన చేయడంపై పలు సెక్షన్ల కింద కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు సీఐ టి.కరుణాకర్‌ తెలిపారు.

సంబంధిత పోస్ట్