బళ్లారి కాల్పుల ఘటనపై కేసు నమోదు

45చూసినవారు
కర్నాటక బళ్లారి కాల్పుల ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. గాలి జనార్ధన్‌రెడ్డి, శ్రీరాములు, సోమశేఖర్‌రెడ్డి సహా.. 11 మందిపై బ్రూస్‌పేట పీఎస్‌లో కేసు నమోదైంది. కాగా అర్ధరాత్రి గాలి జనార్దన్‌రెడ్డిపై కాల్పుల కలకలం రేపింది. బళ్లారిలో MLA భరత్‌రెడ్డి సన్నిహితుడి సతీష్ రెడ్డి గన్‌మన్‌ తుపాకీ లాక్కుని కాల్పులు జరిపాడు. ఇరువర్గాల పరస్పర కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. సతీష్‌రెడ్డికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్