దేశవ్యాప్తంగా
నీట్ ఆందోళనల సమయంలో విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్లను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం కీలక తీర్పు ఇచ్చింది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే కేసుల ఎత్తివేత నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఇచ్చిన హామీ మేరకు కేంద్రంతో పాటు
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కేసుల ఎత్తివేత ప్రక్రియ వేగవంతమైందన్నారు. ప్రధాని
మోదీ ప్రాధాన్యం ఎల్లప్పుడూ యువత అభ్యున్నతేనని ఆయన స్పష్టం చేశారు.