హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలో సుమారు 120 వీధి కుక్కలను చంపి పాతిపెట్టిన ఘటనపై కేసు నమోదైంది. సర్పంచ్ ఎన్నికల హామీల్లో భాగంగా ఈ హత్యలు జరిగినట్లు తెలుస్తోంది. శాయంపేట, ఆరేపల్లి గ్రామాల్లో కుక్కల ప్రాణాలు తీసిన గ్రామ పంచాయతీ సిబ్బందిపై మొత్తం 9 మందిపై కేసులు నమోదు చేశారు. పోలీసులు, వెటర్నరీ సిబ్బంది కుక్కల కళేబరాలను వెలికితీసి, పోస్టుమార్టం నిర్వహించి శాంపిల్స్ సేకరించారు. కుక్కలకు స్కిన్ డిసీజ్ ఉండడం వల్ల ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారని గ్రామస్తులు చెబుతున్నారు.