
దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్ల సమ్మె!
దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్లు బుధవారం సమ్మెకు పిలుపునిచ్చారు. స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్ వంటి క్విక్ కామర్స్ సంస్థల డెలివరీ ఏజెంట్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. 10 నిమిషాల డెలివరీ మోడల్‌ను రద్దు చేయాలని, సరైన వేతనం, ప్రమాద బీమా కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. చిన్న కారణాలకే ఐడీలను బ్లాక్ చేయడాన్ని నిరసిస్తూ ‘లాగిన్’ అవ్వకూడదని నిర్ణయించుకున్నారు. దీంతో DEC 31న డెలివరీ సర్వీసులు నిలిచిపోనున్నాయి.




