నకిలీ వీసా రాకెట్‌.. గుట్టురట్టు చేసిన సీబీఐ

4చూసినవారు
నకిలీ వీసా రాకెట్‌.. గుట్టురట్టు చేసిన సీబీఐ
కువైట్ నకిలీ ఈ-వీసాలను సృష్టించి, ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న అంతర్జాతీయ నెట్‌వర్క్‌ను సీబీఐ ఛేదించింది. జనవరి 30న దేశవ్యాప్తంగా 35 ప్రాంతాల్లో సీబీఐ ఏకకాలంలో దాడులు నిర్వహించి, కీలక సైబర్ నేరగాడిని అరెస్ట్ చేసింది. ఈ దాడుల్లో కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, నకిలీ వీసాలు, రూ. 60,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు కువైట్ అధికారిక ఈ-వీసా వెబ్‌సైట్లను పోలిన నకిలీ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను సృష్టించి, నిరుద్యోగుల నుంచి డబ్బు వసూలు చేస్తున్నారు. ఈ ముఠా భారతీయులతో పాటు అమెరికా, బ్రిటన్ వంటి దేశాల వారిని కూడా లక్ష్యంగా చేసుకుంది.

సంబంధిత పోస్ట్