తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలోని కరుమత్తంపట్టిలో 15 రోజుల క్రితం జరిగిన ఒక భీకర దాడికి సంబంధించిన సీసీటీవీ (CCTV) దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చి సంచలనం రేపుతున్నాయి. టీ తాగడానికి వచ్చిన కొందరు యువకులపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అడ్డగించి, వారిపై విచక్షణారహితంగా దాడి చేయడమే కాకుండా కత్తితో పొడిచేందుకు ప్రయత్నించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.