TG: భార్యపై కత్తితో దాడి చేసి ఓ వ్యక్తి దారుణంగా చంపాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో జరిగింది. మణిదీప్, శిరీష(24) దంపతుల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో భర్తపై శిరీష PSలో ఫిర్యాదు చేసింది. పోలీసుల కౌన్సెలింగ్ తర్వాత వెళ్తుండగా ఆమెపై కత్తితో దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో శిరీష అక్కడికక్కడే మృతి చెందింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది.