ముంబై కాండివలి ఈస్ట్‌లోని ఓ కాంప్లెక్స్‌లో యువకుడిపై దాడి జరిగింది. రుమాలుతో ముఖం కప్పుకున్న వ్యక్తి వికాస్ కుటే అనే యువకుడిపై కత్తితో దాడి చేయగా, అతడి చేతికి తీవ్ర గాయమైంది. ఆగస్టు 31న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు బయటకు రావడంతో స్థానికంగా కలకలం రేగింది. బాధితుడి ఫిర్యాదు మేరకు సమతా నగర్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.