కేంద్ర ప్రభుత్వం భారత్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ అనిల్ చౌహాన్ పదవీ కాలాన్ని వచ్చే ఏడాది మే 30 వరకు పొడిగించింది. సెప్టెంబర్ 30న ఆయన సీడీఎస్‌గా సర్వీసు ముగియనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 1981లో 11 గోర్ఖా రైఫిల్స్‌లో చేరిన అనిల్ చౌహాన్ దాదాపు 40 ఏళ్ల సైనిక జీవితంలో వివిధ హోదాల్లో సేవలు అందించారు. వాయుసేన, జమ్మూ కాశ్మీర్, ఈశాన్య భారతదేశంలో తిరుగుబాటు నిరోధంలో అనుభవం కలిగిన ఆయన చైనా వ్యవహారాల నిపుణుడిగా పేరు పొందారు.