గాజాలో కాల్పుల విరమణ.. అమలులోకి హమాస్ - ఇజ్రాయెల్ ఒప్పందం

17416చూసినవారు
గాజాలో కాల్పుల విరమణ.. అమలులోకి హమాస్ - ఇజ్రాయెల్ ఒప్పందం
గాజా స్ట్రిప్‌లో హమాస్ - ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమలులోకి వచ్చింది. డొనాల్డ్ ట్రంప్ చొరవతో యుద్ధాన్ని ఆపేందుకు ఇరు పక్షాలు అంగీకరించాయి. బందీలు, ఖైదీల విడుదలకు సంబంధించిన ట్రంప్ ప్రణాళికను ఆమోదించిన కొద్ది గంటల్లోనే ఈ ఒప్పందం అమల్లోకి వచ్చింది. అయితే శుక్రవారం ఉదయం గాజాలోని కొన్ని ప్రాంతాల్లో ఇజ్రాయెల్ దాడులు జరిగాయి. ఈ ఒప్పందం అమలును పర్యవేక్షించడానికి అమెరికా సుమారు 200 మంది సైనికులను ఇజ్రాయెల్‌కు పంపనుంది.