ఎన్నికల సంఘంపై నటుడు ప్రకాశ్ రాజ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రతి ఏటా ఓటర్ల జాబితా తనిఖీ జరుగుతుందని, అయితే ఎన్నికల సంఘం తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓటు హక్కు కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని అడుగుతున్నారని, అక్రమ చొరబాటుదారులపై కేంద్ర హోంశాఖ ఏం చర్యలు తీసుకుంటుందని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల సంఘం తీరుపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.