భూపాలపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో కుప్పకూలిన సీలింగ్

2చూసినవారు
TG: ఇటీవల పలు చోట్ల ప్రభుత్వ ఆస్పత్రులలో పైకప్పు (సీలింగ్)లు కూలిపోయిన ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. తాజాగా భూపాలపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. చిన్నపిల్లల వార్డులో సీలింగ్ పెచ్చులు ఊడి పడ్డాయి. అయితే ఆ సమయంలో ఎవరూ వార్డులో లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కొన్ని రోజుల క్రితం వరంగల్ ఎంజీఎంలో రెండు సార్లు పెచ్చులు ఊడిపడ్డాయి. ఈ ఘటనలతో రొగులు ఆందోళన చెందుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్