సామాన్యులకు షాక్.. అక్టోబర్‌లో మళ్లీ పెరగనున్న సిమెంట్ ధరలు!

21996చూసినవారు
సామాన్యులకు షాక్.. అక్టోబర్‌లో మళ్లీ పెరగనున్న సిమెంట్ ధరలు!
సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకునే వారికి, నిర్మాణ రంగానికి సిమెంట్ కంపెనీలు షాక్ ఇవ్వనున్నాయి. సెప్టెంబర్‌లో దేశవ్యాప్తంగా బస్తాపై సగటున రూ. 7 పెరగ్గా.. అక్టోబర్‌లో మరో రూ. 5 నుండి రూ. 20 వరకు ధరలు పెరిగే అవకాశముందని ‘సెంట్రమ్ బ్రోకింగ్’ నివేదిక తెలిపింది. ఇంధన ఖర్చులు పెరగడం, నిర్మాణ పనులు మళ్లీ పుంజుకోవడమే దీనికి కారణం. ప్రస్తుతం దేశంలో సిమెంట్ బస్తా సగటు ధర రూ. 356 కాగా, దక్షిణ భారతదేశంలోనే అత్యధికంగా రూ. 11 చొప్పున పెరిగింది.

సంబంధిత పోస్ట్