తెలంగాణలో మే 10 నుంచి జనగణన.. కలెక్టర్లతో సీఎస్ సమీక్ష

20చూసినవారు
తెలంగాణలో మే 10 నుంచి జనగణన.. కలెక్టర్లతో సీఎస్ సమీక్ష
తెలంగాణలో మే 10 నుంచి ప్రారంభం కానున్న జనగణన ప్రక్రియపై ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో, సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జనగణన నిర్వహణకు సంబంధించి చేపట్టాల్సిన ముందస్తు ఏర్పాట్లపై సీఎస్ సుదీర్ఘంగా సమీక్షించారు. ఎన్యుమరేటర్ల నియామకం, వారికి శిక్షణ, క్షేత్రస్థాయిలో గణన ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించడం వంటి అంశాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. మే 10 నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్