శతాధికా వృద్దురాలు మృతి.. కళ్లను దానం చేసిన కుటుంబ సభ్యులు

15చూసినవారు
శతాధికా వృద్దురాలు మృతి.. కళ్లను దానం చేసిన కుటుంబ సభ్యులు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణానికి చెందిన 103 ఏళ్ల డోలి నరసమ్మ సోమవారం అనారోగ్యంతో మరణించారు. ఆమె మృతితో కుటుంబ సభ్యులు దుఃఖంలో ఉన్నప్పటికీ, ఆమె నేత్రాలను దానం చేయడానికి ముందుకు వచ్చారు. సమాచారం అందుకున్న ఎల్.వి. ప్రసాద్ ఐ బ్యాంక్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని ఆమె నేత్రాలను సేకరించారు. ఈ సంఘటన సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you