ఏయూలో ఘనంగా శతాబ్ది ఉత్సవాలు

11172చూసినవారు
ఏయూలో ఘనంగా శతాబ్ది ఉత్సవాలు
ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ)లో శతాబ్ది ఉత్సవాలు ఇంజినీరింగ్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌ హాజరయ్యారు. ఆయనకు గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వాగతం పలికారు. ఏయూ చాన్స్‌లర్‌ హోదాలో గవర్నర్ నజీర్ కూడా పాల్గొన్నారు. విశిష్ట అతిథిగా భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా ఈ వేడుకలకు హాజరయ్యారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని విశ్వవిద్యాలయానికి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్