ఆదిలాబాద్‌లో మెగా ఎయిర్‌పోర్ట్‌కు కేంద్రం ఆమోదం

4చూసినవారు
ఆదిలాబాద్‌లో మెగా ఎయిర్‌పోర్ట్‌కు కేంద్రం ఆమోదం
TG: ఆదిలాబాద్‌లో మెగా కమర్షియల్‌ ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. జూన్‌ మొదటివారంలో విమానాశ్రయం పనులకు శంకుస్థాపన చేయనున్నారు. 1930 నిజాం కాలంలో సైనిక అవసరాల కోసం నిర్మించిన ఈ ఎయిర్‌స్ట్రిప్‌ దశాబ్దాలుగా నిరుపయోగంగా ఉంది. మొత్తం 1,062 ఎకరాల్లో ఈ మెగా ఎయిర్‌పోర్ట్‌ రూపుదిద్దుకోనుంది. ఇందులో 362 ఎకరాల రక్షణశాఖ భూమి ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం 700 ఎకరాల భూసేకరణను వేగవంతం చేసింది.

సంబంధిత పోస్ట్