తెలంగాణలో రూ.9,584 కోట్లు విలువైన ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం

0చూసినవారు
తెలంగాణలో రూ.9,584 కోట్లు విలువైన ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రానికి రూ. 9,584 కోట్ల విలువైన ప్రాజెక్టులను ఆమోదించినట్లు వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అమృత్ 2.0 పథకం కింద తెలంగాణలో 252 ప్రాజెక్టులకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆమోదం తెలిపిందని లోక్‌సభలో ఆ శాఖ సహాయ మంత్రి టోకన్ సాహు తెలిపారు. TG ఎంపీలు ఈటల రాజేందర్, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు తోఖాన్ సాహు బదులిస్తూ, రాష్ట్రంలో రూ. 9,584 కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపినట్లు ప్రకటన చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్