గ్యాస్ సిలిండర్లపై కేంద్రం హై అలర్ట్

9చూసినవారు
గ్యాస్ సిలిండర్లపై కేంద్రం హై అలర్ట్
మధ్యప్రాచ్య దేశాల్లో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో ఎల్‌పీజీ సరఫరాపై ప్రభావం పడకుండా కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు కనీసం 30 రోజుల ఎల్‌పీజీ నిల్వలు సిద్ధంగా ఉంచుకోవాలని కేంద్ర పెట్రోలియం శాఖ ఆదేశించింది. ప్రస్తుతం దేశంలో వంటగ్యాస్ కొరత లేదని, సరఫరా సాధారణంగానే కొనసాగుతోందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. పట్టణాల్లో 24-48 గంటల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 3-5 రోజుల్లో సిలిండర్ల డెలివరీ జరుగుతోందని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you