యుద్ధం నేపథ్యంలో దేశంలో కిరోసిన్ వినియోగాన్ని అమలు చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. పెట్రోల్ బంకుల్లో తాత్కాలికంగా 60 రోజుల పాటు దీన్ని పంపిణీ చేయాలని నిర్ణయించింది. ప్రతి జిల్లాలో 2 బంకులు 5 వేల లీటర్ల కిరోసిన్‌ను నిల్వ చేసుకునేలా నిబంధనలు సడలించింది. అలాగే ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా కిరోసిన్ సరఫరా చేయనుంది. పీఎన్‌జీ కోసం శనివారం 6 వేల మంది స్వచ్ఛందంగా ఎల్‌పీజీ కనెక్షన్లు వదులుకున్నట్లు కేంద్రం తెలిపింది.