గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి కేంద్రం చర్యలు చేపట్టింది. ఇండిగో ఇవాళ జెడ్డా నుంచి పది ప్రత్యేక విమానాలు నడపనుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లో చిక్కుకున్న వారిని తరలించేందుకు పుజైరా నుంచి ఢిల్లీ, ముంబై, కొచ్చికి నాలుగు స్పెషల్ విమానాలను స్పైస్ జెట్ నిర్వహిస్తోంది. అలాగే ఎతిహాద్ ఎయిర్‌వేకు చెందిన విమానం అబుదాబి నుంచి ఢిల్లీకి చేరుకుంది.