
న్యూజిలాండ్తో చివరి వన్డే.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
న్యూజిలాండ్తో వన్డే సిరీస్లో భాగంగా ఇవాళ చివరి మ్యాచ్ జరగనుంది. సిరీస్ చేజిక్కించుకోవాలంటే తప్పక నెగ్గాల్సిన ఈ మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్లో ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్న విషయం తెలిసిందే. IND: గిల్(C), రోహిత్, కోహ్లీ, శ్రేయస్, రాహుల్, జడేజా, నితీశ్, హర్షిత్, కుల్దీప్, సిరాజ్, అర్ష్దీప్, NZ: కాన్వే, నికోల్స్, యంగ్, మిచెల్, ఫిలిప్స్, మిచెల్ హే, బ్రేస్వెల్(C), జాకరీ, క్లార్క్, జెమీసన్, జేడెన్.




