పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు పూర్తయ్యాక కూడా 60 రోజులపాటు కేంద్ర బలగాలను రాష్ట్రంలోనే కొనసాగిస్తామని తెలిపారు. ఓటర్లు ఎలాంటి భయాందోళనలు లేకుండా చివరి దశ పోలింగ్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇక ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం, ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఉద్దేశించిన రూ.510 కోట్ల విలువైన అక్రమ తాయిలాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.