కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. యాక్సెస్ కంట్రోల్ రహదారిగా NH-44

0చూసినవారు
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. యాక్సెస్ కంట్రోల్ రహదారిగా NH-44
TG: హైదరాబాద్–బెంగళూరు జాతీయ రహదారి (ఎన్‌హెచ్-44)ని యాక్సెస్ కంట్రోల్ హైవేగా అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత హైవేనే ఆరు లేన్లుగా విస్తరించి, ఆధునిక భద్రతా ప్రమాణాలతో తీర్చిదిద్దనున్నారు. ఈ మార్పుతో హైదరాబాద్ నుంచి బెంగళూరు ప్రయాణ సమయం 7–8 గంటల నుంచి సుమారు 5 గంటలకు తగ్గనుంది. పరిమిత ఎంట్రీ–ఎగ్జిట్ పాయింట్లు, సర్వీస్ రోడ్లతో ట్రాఫిక్ జామ్‌లు తగ్గి రోడ్డు భద్రత మెరుగవుతుంది. ఈ ప్రాజెక్ట్ పారిశ్రామిక, వాణిజ్య అభివృద్ధికి ఊతమివ్వనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్