
అంత్యక్రియలకు తీసుకెళ్తుంటే లేచి కూర్చున్న వృద్ధుడు (వీడియో)
TG: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక వింత సంఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న శంకరయ్య అనే వృద్ధుడిని కుటుంబసభ్యులు కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అతడు మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో కుటుంబసభ్యులు అంత్యక్రియల కోసం అతన్ని అంబులెన్స్‌లో స్వగ్రామానికి తరలిస్తుండగా, శంకరయ్య ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు. దీంతో కుటుంబసభ్యులు అతన్ని తిరిగి ఆసుపత్రికి తీసుకెళ్లారు.




