కెప్టెన్ స్మిత్ మచ్చర్ ఆరోగ్యం మెరుగుపడుతోందని కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించింది. ఆయన కోలుకుంటున్నారని తెలిపింది. స్మిత్‌కు మెరుగైన చికిత్స అందిస్తున్న యూఏఈ ప్రభుత్వానికి విదేశాంగ శాఖ కృతజ్ఞతలు తెలిపింది. ఫ్లైదుబాయ్ విమానంలో ఒమన్ దేశస్తుడైన కో-పైలట్ దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన మచ్చర్.. ప్రాణాలకు తెగించి 174 మందిని రక్షించిన విషయం తెలిసిందే.