SMATలో సెంచరీ.. చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ

2చూసినవారు
SMATలో సెంచరీ.. చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ
భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ మంగళవారం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT)లో అతిపిన్న వయసు (14 ఏళ్ల 250 రోజులు)లో సెంచరీ చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. మహారాష్ట్ర, బిహార్ మధ్య జరిగిన మ్యాచ్‌లో వైభవ్ 108* (61 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్స్‌లు) పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు 18 ఏళ్ల 118 రోజుల వయసులో విజయ్ జోల్ పేరిట ఉండేది. వైభవ్‌కు SMATలో ఇది తొలి శతకం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్