తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన సర్ ప్రక్రియ అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. అధికారులు 3 రోజుల్లో 1.02 కోట్లకుపైగా ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేశామని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. బీఎల్‌వోలకు బదులు బీఎల్‌ఏలు ఫారాలు పంచుతున్నారనే ఆరోపణలు, నిరక్షరాస్యుల ఇళ్లలో ఫారాలు నింపే తీరుపై అనుమానాలు, సర్వర్ల మొరాయింపు, ఓటర్ల మ్యాపింగ్ జరగకపోవడం వంటి సమస్యలు ప్రక్రియను నెమ్మదింపజేస్తున్నాయి. 2002 ఓటరు లిస్ట్‌లో తమ పేరు ఉందా లేదా అనే దానిపై ఓటర్లలో స్పష్టత లేక అయోమయం నెలకొంది.