తెలంగాణలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. జులై-ఆగస్టులో ఎల్‌నినో ప్రభావం పెరిగే ఛాన్స్ ఉందని అంచనా వేసింది. సెప్టెంబర్ నాటికి ఎల్‌నినో మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొంది. ఇక ఎల్‌నినో ప్రభావంతో దక్షిణ భారతంలో వర్షాలు తగ్గే ఛన్స్ ఉన్నట్లు తెలిపింది.