డిసెంబర్ 31 దగ్గరపడుతున్న నేపథ్యంలో పలు కీలక పనులు పూర్తిచేయాలని అధికారులు సూచిస్తున్నారు. PM ఆవాస్ యోజన దరఖాస్తులకు ఈ నెల 31 వరకు మాత్రమే అవకాశం ఉంది. ఇన్‌కమ్‌ట్యాక్స్ బెలేటెడ్ రిటర్న్ దాఖలు చేయడానికి కూడా అదే లాస్ట్ డేట్. అదేవిధంగా ఆధార్–పాన్ లింక్‌కు చివరి తేదీ 31. ఒకవేళ ఆ తేదీ లోపు లింక్ చేసుకోకపోతే పాన్ రద్దు అవుతుంది. అలాగే కొన్ని రాష్ట్రాల్లో రేషన్ కార్డు e-KYC పూర్తి చేయడానికి కూడా డిసెంబర్ 31 లాస్ట్ డేట్. కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టేలోపు ఈ పనులు పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు.