AP: చేవెళ్ల రోడ్డు ప్రమాదంపై సోమవారం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో 21 మంది మృతి చెందడం తీవ్రంగా కలిచివేసిందని చెప్పారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు వెల్లడించారు. కాగా, TGలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టిన విషయం తెలిసిందే.