TG: బీజేపీ–కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణను రేవంత్ రెడ్డి కాకుండా చంద్రబాబు పాలిస్తున్నారని అన్నారు. రేవంత్ నామమాత్రంగా సీఎం కుర్చీలో ఉన్నారని, పరిపాలన పూర్తిగా ఆంధ్రా పాలకుల చేతుల్లో ఉందని ఆరోపించారు. అలాగే, అసెంబ్లీలో ప్రవేశపెట్టిన హేట్ స్పీచ్ బిల్లు మీడియా కట్టడికి ఉపయోగపడే అవకాశం ఉందని విమర్శించారు.