ఎన్డీఏ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడుకి కీలక బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై దక్షిణాది రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి, తమిళనాడు సీఎం విజయ్ వంటి నాయకులను ఒప్పించే బాధ్యతను కేంద్ర పెద్దలు చంద్రబాబుకు అప్పగించినట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో ఈ బిల్లులను మరోసారి ప్రవేశపెట్టే అవకాశం ఉన్నందున, ఆ సమయానికి పూర్తిస్థాయిలో మద్దతు కూడగట్టాలని చంద్రబాబుకు కేంద్రం బాధ్యత అప్పగించినట్లు తెలుస్తోంది. ఇందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.