
మద్యం మత్తులో స్నేహితుడిపై మందు బాటిల్తో దాడి
విజయవాడ రైల్వే స్టేషన్లో మద్యం మత్తులో స్నేహితుల మధ్య జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. రాము, సాయి అనే ఇద్దరు స్నేహితులు మద్యం సీసాలతో రైల్వే స్టేషన్కు వెళ్లగా, వారి మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. ఆవేశానికి లోనైన రాము.. తన చేతిలోని మద్యం బాటిల్తో సాయి మెడపై పొడవడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. ప్రయాణికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, నిందితుడు రామును అదుపులోకి తీసుకున్నారు. రాముపై గతంలో 15 కేసులు నమోదైనట్లు సమాచారం.




