AP: విశాఖలో శుక్రవారం ప్రత్యేకత సంతరించుకోనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ ముగ్గురూ ఒకేసారి నగరంలో ఉండనున్నారు. వీరి పర్యటనలు వేర్వేరు అయినా, ఒకే సమయంలో విశాఖలో ఉండడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. పవన్ కల్యాణ్ 3 రోజుల పాటు ‘సేనతో సేనాని’ సమీక్షా సమావేశాల్లో, లోకేష్ పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. సీఎం చంద్రబాబు పలు సమావేశాలకు హాజరవుతారు.