ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు విడుదల చేసిన చంద్రబాబు

34చూసినవారు
AP: పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు గోదావరి నీటిని బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో పోలవరం ఎడమ ప్రధాన కాలువ శిలాఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం రెగ్యులేటర్ ఆన్ చేసి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా గోదావరికి అఖండ హారతి ఇచ్చారు. ఈ ఎడమ కాలువ ద్వారా 2.87 లక్షల ఎకరాలకు సాగునీరు, 5.23 లక్షల మందికి తాగునీరు అందనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్