
ఆటోను ఢీకొన్న ట్యాంకర్.. ఏడుగురు మృతి (వీడియో)
TG: సంగారెడ్డి జిల్లాలో మంగళవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జహీరాబాద్ మండలం సత్వార్ గ్రామం సమీపంలో యూ టర్న్ వద్ద లారీ ట్యాంకర్.. కూలీలను తీసుకుని వస్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 7మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. కర్ణాటక రాష్ట్రం హుమనాబాద్ నుండి జహీరాబాద్ వస్తున్న ట్యాంకర్, ఆటోను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులంతా కర్ణాటక రాష్ట్రం రాజగిరికి చెందినవారిగా గుర్తించారు.




