
ఇరాన్ యుద్ధం: అమెరికాకు భారీ ఆర్థిక నష్టం
ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంలో అమెరికా భారీగా ఖర్చు చేస్తోంది. తొలి 24 గంటల్లోనే దాదాపు 6900 కోట్లు ఖర్చు చేయగా, నెల రోజుల పాటు యుద్ధం కొనసాగితే మొత్తం ఖర్చు 18.87 లక్షల కోట్లకు చేరుకోవచ్చని అంతర్జాతీయ మీడియా నివేదిస్తోంది. యుద్ధ విమానాల నిర్వహణకు రోజుకు 58 కోట్లు ఖర్చవుతోంది. చమురు ధరలు పెరగడం, అంతర్జాతీయ వాణిజ్యంలో మార్పుల వల్ల అమెరికాకు 115 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఇప్పటికే ఆర్థిక ఒత్తిడితో సతమతమవుతున్న అమెరికా, ఈ యుద్ధంతో మరింత ఇబ్బందుల్లో పడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.




