తిరుమలలో అంగప్రదక్షిణ టోకెన్ల జారీ విధానంలో మార్పు

51చూసినవారు
తిరుమలలో అంగప్రదక్షిణ టోకెన్ల జారీ విధానంలో మార్పు
AP: శ్రీవారి భక్తులకు అలర్ట్. తిరుమల అంగప్రదక్షిణ టోకెన్ల జారీ విధానంలో టీటీడీ కీలక మార్పులు చేసింది. ఇప్పటివరకు ఉన్న లక్కీ డిప్ విధానాన్ని రద్దు చేసి, ఇకపై FIFO (First In First Out) పద్ధతిలో టోకెన్లు కేటాయించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన టోకెన్లు మూడు నెలల ముందుగానే ఆన్‌లైన్‌లో విడుదలవుతాయి. భక్తులు ఈ మార్పును గమనించి, తమ అంగప్రదక్షిణ టోకెన్లను బుక్ చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్