
అమ్మకాల్లో దూసుకెళ్తోన్న మారుతి సుజుకి!
భారతదేశంలో ఎస్‌యూవీలకు డిమాండ్ ఉన్నప్పటికీ, మారుతి సుజుకి డిజైర్ సెడాన్ అమ్మకాలలో అగ్రస్థానంలో నిలుస్తోంది. FY27 ఏప్రిల్-జూలై మధ్య 89,816 యూనిట్లు, FY26లో 2,29,130 యూనిట్లు అమ్ముడయ్యాయి. మంచి మైలేజ్, తక్కువ నిర్వహణ ఖర్చు, విశాలమైన క్యాబిన్, రీసేల్ విలువ, మారుతి బ్రాండ్ నమ్మకం, విస్తృత సర్వీస్ నెట్వర్క్ దీనికి కారణాలు. భద్రతలో 5 స్టార్ రేటింగ్, 6 ఎయిర్‌బ్యాగులు, 1.2 లీటర్ పెట్రోల్ (24.79 కిమీ/లీ మైలేజ్), సీఎన్జీ (33.73 కిమీ/కేజీ మైలేజ్) ఇంజిన్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. ధర సుమారు రూ.6.26 లక్షల నుంచి రూ.9.36 లక్షల వరకు ఉంది.




