ఫాస్టాగ్ లేని వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఇప్పటి వరకు రెట్టింపు టోల్ ఛార్జీలు చెల్లించాల్సిన పరిస్థితిని మార్చుతూ, యూపీఐ ద్వారా టోల్ చెల్లిస్తే కేవలం 25% అదనపు రుసుము మాత్రమే వసూలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త నిబంధన నేటి నుంచే అమల్లోకి వస్తోందని పేర్కొంది. యూపీఐ పేమెంట్స్‌కు ప్రత్యేక వెసులుబాటు కల్పించడంతో ఫాస్టాగ్ లేని వాహనదారులకు భారం తగ్గనుంది.